Coordination Meeting of Alliance Parties in Hindupuram: టీడీపీ పాలనలో రాయలసీమ ఎంతో ప్రశాంతంగా ఉండేదని వైసీపీ పాలనలో రక్తం పారిందని నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని జేవీఎస్ ప్యాలెస్లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన, భాజపా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించబోతున్నానని అన్నారు. జరిగే ఎన్నికల మహా సంఘంలో రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎం జాబితాలో జగన్ ఫస్ట్ : లోకేశ్ - Nara Lokesh Fire on CM Jagan
నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో ఉండే వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం భ్రష్ట పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో రాయలసీమ ఎంతో ప్రశాంతంగా ఉండేదని జగన్ ప్రభుత్వం వచ్చాక రక్తం పారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానాన్ని నిషేదిస్తామని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నా అక్కలు, నా చెల్లెలు అంటూ చెబుతున్న వారికే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మరో 10 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారని మండి పడ్డారు.
రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలంటే కూటమి ప్రభుత్వం కచ్చితంగా అధికారంలోకి రావాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. రాష్ట్రానికి సుస్థిరమైన పాలన అందించే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఈ సమావేశంలో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే. పార్థసారథి, జనసేన జిల్లా కన్వీనర్ వరుణ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
దాహం కేకలు - అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజల ఆగ్రహం - People Suffering water problems
ఈ ఎన్నికల్లో కూడా హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించబోతున్నాను. కచ్చితంగా కూటమిదే అధికారం. టీడీపీ పాలనలో రాయలసీమ ఎంతో ప్రశాంతంగా ఉండేది కాని జగన్ పాలనలో రక్తం పారింది. మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడుతున్నారు. అలానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్రం బాగుండాలనే ఆకాంక్షతో పొత్తులు పెట్టుకుని పని చేస్తున్నారు. కచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అలానే రాష్ట్రానికి సుస్థిరమైన పాలన అందించే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది.- బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే