ETV Bharat / politics

సీట్ల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు - ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి

Chandrababu started exercise on Seat Sharing: తెలుగుదేశం - జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేశాయి. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు వచ్చే రెండుమూడు రోజుల పాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.

TDP Janasena Seat Sharing
TDP Janasena Seat Sharing
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 6:48 PM IST

Updated : Jan 30, 2024, 7:37 PM IST

Chandrababu started exercise on Seat Sharing: ఇప్పటికే వైఎస్సార్సీపీ టికెట్ కేటాయింపులు, నేతలు పోటీ చేసే స్థానాల్లో మార్పులు చేర్పులతో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థులకంటే, పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడం ఆయా పార్టీలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేయనున్న నేపథ్యంలో, అటు టీడీపీ, ఇటు జనసేన నుంచి ఆశావహులు టికెట్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇరుపార్టీలకు ఆమోదయోగ్యం అయ్యే విధంగా టికెట్ కేటాయిపుల ప్రక్రియ కొనసాగేలా, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు.

సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై దృష్టి: తెలుగుదేశం - జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేశాయి. సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో ఉమ్మడి ప్రకటనకు అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు - పవన్ కల్యాణ్ సమావేశమై చర్చించారు. అతి త్వరలో మరోసారి సమావేశమై ఈ కసరత్తును కొలిక్కి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోపైనా చంద్రబాబు - పవన్ తుది కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు వచ్చే రెండుమూడు రోజుల పాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.

తాడేపల్లికి విజయవాడ సెంట్రల్​ వివాదం - మల్లాది విష్ణుకు బుజ్జగింపులు

"రా కదలి రా ” సభలకు తాత్కాలిక విరామం: టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులు, సర్దుబాట్ల కోసమే చంద్రబాబు "రా కదలి రా ” సభలకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఇప్పటివరకు 17 పార్లమెంట్ స్థానాల్లో సభలు పూర్తి చేశారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి మిగిలిన నియోజకవర్గాల్లో "రా కదలి రా ” సభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే వచ్చే నెల 4వ తేదీన అనకాపల్లి నుంచి పవన్ పర్యటన ప్రారంభం కానున్నట్టు జనసేన సంకేతాలు ఇచ్చింది.

ఇరు పార్టీల నేతలపై ఒత్తిడి : తెలుగుదేశం పార్టీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట, అరకు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమతో సంప్రదించకుండానే టీడీపీ టికెట్లను ప్రకటించారని ఆరోపించారు. టీడీపీకి ఒత్తిడి ఉన్నట్లే తమకు కూడా టికెట్ల కేటాయింపు అంశంలో ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యల అనంతర పరిణామాలు, ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ల కేటాయింపుపై అంశంపై చంద్రబాబు తెలుగుదేశం నేతలతో భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులు, సామాజిక సమీకరణాలను ఆధారంగా టికెట్ల కేటాయింపులపై చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్ ఇంటికి​ టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేన సీట్ల కేటాయింపు సహా ఎన్నికల వ్యూహంపై చర్చ

Last Updated : Jan 30, 2024, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.