Chandrababu oath taking guests : ఎన్ఢీఏ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు ఇవాళ మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఇది నాలుగోసారి కాగా, మధ్యాహ్నం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభాప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబు కాగా, దేశ విదేశాల నుంచి ప్రముఖులు ఎందరో హాజరుకానున్నారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్ వేదికపై ఆసీనులు కానున్నారు. సభా వేదికపై 36మందికి అవకాశం కల్పించారు. వారెవరో తెలుసా?
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - హాజరు కానున్న ప్రధాని మోదీ - Chandrababu Oath Ceremony as CM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ దంపతులు సయ్యద్ అబ్దుల్ నజీర్, సమీరా నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, జితన్ రామ్ మాఝి, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, రామ్మోహన్ నాయుడు, నితిన్ గడ్కరీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, రిటైర్డ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, కేంద్ర మంత్రులు జయంత్ చౌధరి, అనుప్రియ పటేల్, రాందాస్ అధ్వాలే, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, తెలంగాణా మాజీ గవర్నర్ తమిల్సై సౌందర్ రాజన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, హిందూపుర్ ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆయన సతీమణి అన్నా లెజినోవా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, మెగాస్టార్ చిరంజీవి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్, తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన సతీమణి లతా రజనీకాంత్ వేదికపై ఆసీనులు కానున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభకు 50వేల మందికి పాసులు జారీ చేయగా అంతకు రెట్టింపు స్థాయిలో హాజరయ్యే అవకాశాలున్నాయి.
వీడిన ఉత్కంఠ - కొత్త మంత్రులు వీరే! - AP New Cabinet Ministers List