ETV Bharat / opinion

మాచర్లలో పిన్నెల్లి మాఫియా - ఎమ్మెల్యే క్రిమినల్‌గా మారితే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? - PINNELLI EVM DESTROY CASE

Pratidwani : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన దౌర్జన్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి వెళ్లిన పిన్నెల్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతోపాటు వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. దీనిపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం ఉదయం నుంచి గాలించిన పోలీసులు, ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

Macherla Mla Pinnelli Ramakrishna Reddy EVM Destroy Case
Macherla Mla Pinnelli Ramakrishna Reddy EVM Destroy Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 10:02 PM IST

Pratidwani : ఒకప్పుడు ఎన్నికల్లో ఓటమి భయంతో బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోయడం, బ్యాలెట్ పత్రాలపై ఇంకు పోయటం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం వంటి ఘటనలు జరిగేవి. ఆయా పార్టీలు పురమాయించిన దుండగులు అలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారు. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (YCP MLA) స్వయంగా పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన ఈవీఎం(EVM)ను ధ్వంసం చేసి, అక్కడున్న సిబ్బందిని బెదిరించిన దృశ్యాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ అంటేనే అరాచకపార్టీ అని, మాచర్లలో మాఫియా సామ్రాజ్యం స్థాపించిందని గత ఐదేళ్లుగా ఏపీ పౌరసమాజం నెత్తీనోరు బాదుకుని చెప్పింది. ఇప్పుడు అదే నిజమని నిరూపణైంది. చీఫ్ సెక్రటరీ సహా మొత్తం యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తున్న సీఎం జగన్‌ రెడ్డి ఆప్తుడైన ఈ ఎమ్మెల్యే పొలిటికల్ క్రిమినల్‌లాగా వ్యవహరిస్తుంటే మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ డీజీ శ్రీనివాస్ పాల్గొని చర్చించారు.

మాచర్లలో పెచ్చుమీరుతున్న పిన్నెల్లి సోదరుల అరాచకాలు : ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన దౌర్జన్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి వెళ్లిన పిన్నెల్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతోపాటు వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారి పోలింగ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న విపక్షపార్టీ పోలింగ్ ఏజెంట్‌ ఒక్క ఉదుటున దూసుకెళ్లి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిపై దాడి చేశాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాలన్నీ పోలీంగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎన్నికల ముందు నుంచీ మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయంటూ తెలుగుదేశం చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేట్లు, ఏకంగా ఎమ్మెల్యేనే పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి దౌర్జన్యం చేయడం చూస్తే అక్కడ పోలింగ్ ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ : ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించింది. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఏంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో రాజీ పడేది లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

పారిపోవాలనుకున్న పిన్నెల్లి - పట్టుకున్న పోలీసులు ! - Pinnelli in Police Custody

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్‌ నోటీసులు : ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు అన్ని ఎయిర్‌పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు, పీడీ పీపీ చట్టం కింద మరో కేసు నమోదు, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు నమోదు చేశారు. ఈనెల 20నే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎట్టకేలకు పిన్నెల్లిని అరెస్టు చేసిన పోలీసులు : ఈవీఎం విధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇస్నాపూర్‌ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఇస్నాపూర్‌ లొకేషన్‌ గురించి పటాన్‌చెరు పోలీసులను అడిగిన ఏపీ పోలీసులు ఇస్నాపూర్‌ వరకు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకొని పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు.

ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి - వెలుగులోకి సీసీ కెమెరా దృశ్యాలు - Macherla MLA Pinnelli EVM Destroy

పిన్నెల్లిపై పది సెక్షన్లు- ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం: సీఈవో - CEO MK Meena on Macherla Incidents

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.