Pratidhwani : అది నదులు అయినా భాష అయినా జీవధారలుగా ప్రవహిస్తున్నంత వరకే వాటికి ఉనికి. ఆ ప్రవాహం, పరంపర ఎక్కడ ఆగిపోతుందో, చిక్కిపోతుందో అక్కడితో గడ్డురోజులు మొదలైనట్లే. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా వినుతికెక్కిన తెలుగుభాష కూడా అందుకు మినహాయింపు కాదు. శరవేగంగా మారుతోన్న ఆధునిక, సాంకేతిక యుగంలో మాతృభాషలు ఎదుర్కొంటున్న సవాళ్లే అందుకు కారణం. మరి ఏం చేస్తే మన భాష బతుకుతుంది? తెలుగు భాషా దినోత్సవం సందర్భంలో భాషా ప్రేమికులను కలవర పెడుతోన్న అంశమూ ఇదే.
ఆ సేవల్ని తెలుగులోనే అందించలేమా? : మరి తెలుగు భాష ఈరోజు ఎదుర్కుంటున్న సవాళ్లు ఏంటి? దేశంలో మిగతా మాతృభాషలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయా? వాటితో పోలిస్తే మనం ఎక్కడున్నాం? తెలుగు భాష కాలానుగుణంగా అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటి? ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా భాషలో పరిశోధనలు ఎందుకు జరగటం లేదు? సాంకేతికత, ఇంటర్నెట్ విస్తృతి, వినియోగం పెరుగుతున్న కొద్దీ కూడా చాలామంది ఇంగ్లిష్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. దీనికి మరో మార్గమే లేదా? ఆ సేవల్ని తెలుగులోనే అందించలేమా?
Telugu Basha Dinotsavam 2024 : జపాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉంటూ కూడా వాటి మాతృభాషల్ని ఎలా కాపాడుకుంటున్నాయి? మనం కూడా అలా చేయాలంటే ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? భారతీయ భాషలు ఉనికి, దేశంలోనే ఉద్యోగాల కల్పన అన్ని మాతృభాషలో బోధనతోనే సాధ్యమన్నది పెద్దల మాట. ఈ విషయంలో ప్రభుత్వాల కృషి, ప్రయత్నం ఎలా ఉంది?
సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు తెలుగులోనే కార్యకలాపాల నిర్వహణ అన్నది చిరకాల స్వప్నంగా ఉంది. అది ఆచరణ సాధ్యం కాదా అమలుకు ఉన్న సవాళ్లేంటి? దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే మాతృభాషను కాపాడుకునే విషయంలో తమిళనాడు, కర్ణాటక, కేరళతో పోలిస్తే మనం ఎక్కడ ఉంటాం? ఇంగ్లీష్‌తో సమాంతరంగా తెలుగునూ అభివృద్ధి చేయటంలో ప్రభుత్వం, విశ్వ విద్యాలయాలు, ఉపాధ్యాయ, అధ్యాపకులు, తల్లిదండ్రులు, భాషాభిమానులు, భాషా శాస్త్రవేత్తలు వీరందరి పాత్ర ఎలా ఉండాలి?
Telugu Language Day 2024 : మరీ ముఖ్యంగా ఆధునిక, టెక్ తరానికి, వారి అవసరాలకు తగిన రీతిలో భాషాభివృద్ధి జరిగిందా? లోపం ఎవరిది? దోషం ఎక్కడుంది? ఇకపై జరగాల్సిందేమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో హెచ్‌సీయూ విశ్రాంత ఆచార్యులు, భాషా శాస్త్రవేత్త, తెలుగుభాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు ప్రొ.గారపాటి ఉమామహేశ్వరరావు , విశ్రాంత ఐఏఎస్ అధికారి, తెలుగు భాషాభిమాని ముక్తేశ్వరరావు పాల్గొన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం.