ETV Bharat / opinion

నవరత్నాల పేరుతో ఓట్లేయించుకొని కాలం గడిపేసిన జగన్‌ - ప్రజలకు జరిగిన మేలేంత? - Navaratnalu And Super Six Schemes - NAVARATNALU AND SUPER SIX SCHEMES

Prathidwani: ఐదు సంవత్సరాల క్రితం నవరత్నాల పేరు చెప్పి జనంతో ఓట్లు వేయించుకున్న జగన్‌ అధికారంలోకి వచ్చాక నవరత్నాల పేరుతోనే కాలం గడిపేశారు. ప్రస్తుతం తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీయే కూటమి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఈ రెండింట్లో ఏది ఎక్కువ లబ్ధి చేకూరుతుంది వాటితో ప్రజలకు కలిగే ప్రయోజనం ఎంత అనేది నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 12:44 PM IST

Prathidwani: సూపర్ సిక్స్ వర్సెస్ నవరత్నాలు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ. ఐదు సంవత్సరాల క్రితం నవరత్నాల పేరు చెప్పి జనంతో ఓట్లు వేయించుకున్నారు జగన్‌. అధికారంలోకి వచ్చారు. నవరత్నాల పేరుతోనే కాలం గడిపేశారు. ఇప్పుడు తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీయే కూటమి సూపర్‌ సిక్స్‌తో ప్రజల ముందుకొచ్చింది. ఐదు సంవత్సరాలుగా నవరత్నాలను చూసిన జనం ఇప్పుడు సూపర్‌ సిక్స్‌తో వాటిని పోల్చుకుంటున్నారు. ఈ రెండింట్లో ఏది ఎక్కువ లబ్ధి చేకూర్చుతుంది? ఆయా పథకాలతో వివిధ వర్గాలకు కలిగే ప్రయోజనమెంత? సమాజంలో వాస్తవ మార్పు కోసం ప్రయత్నిస్తున్నదెవరు? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రతిధ్వని చర్చలో సామాజిక కార్యకర్త ఎం.శారద, రాజకీయ విశ్లేషకులు నూర్‌ మహ్మద్ పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న నవరత్నాలతో ప్రజలకు జరిగిన మేలేంత? ఇందులో ప్రధానమైన పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో ఎన్ని గృహాలు నిర్మించారు? తెలుగుదేశం కూటమి హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో ఏయే వర్గాలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? నవరత్నాల్లో భాగంగా జలయజ్ఞం కింద ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? కొత్తగా ఎంత భూమిని సాగులోకి తెచ్చారు? రైతు భరోసా రైతుల్లో ఎంతమేర భరోసా నింపింది?

అన్నదాతలకు జగనన్న చేసిందేమిటి? - ఇచ్చిన హామీలు నెరవేర్చారా? - What CM Jagan done for farmers

ఇంటింటికీ తాగునీటి సరఫరాతో ప్రజలకు ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉంది? అన్నదాత పథకం రైతులకు ఏవిధంగా ఉపయోగపడుతుంది? పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ అవ్వాతాతలకు 3వేల పింఛన్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏటా 250 పెంచుకుంటూ పోతామన్నారు. ఇక వైఎస్‌ఆర్ ఆసరా, చేయూత ద్వారా మహిళలను ఏమేరకు ఆదుకున్నారు? తమ ప్రభుత్వం ఏర్పడగానే రూ. 4 వేల పింఛన్, అది కూడా ఏప్రిల్ నుంచే వర్తింపజేస్తామని కూటమి మాటిచ్చింది.

వర్సిటీలతో రాజకీయం - వైసీపీ కార్యాలయాల్లా విశ్వవిద్యాలయాలు - Universities as Centers of Politics

సూపర్‌సిక్స్‌లో కీలకమైన 'మహాశక్తి పథకం' మహిళల జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చే అవకాశం ఉంది? ఐదు సంవత్సరాలుగా విద్యార్థులందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అందుతోందా? మద్య నిషేధం చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతానన్న జగన్ ఆ మాట నిలబెట్టుకున్నారా సూపర్‌సిక్స్‌లో భాగమైన యువగళం, పూర్‌ టు రిచ్ పథకాలు యువత, పేదల జీవితాల్లో ఏ విధ‍ంగా వెలుగులు నింపుతాయి? బీసీల రక్షణ చట్టం అవసరమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జగన్ పాలనలో అభివృద్ధి అథ:పాతాళం - అప్పులు మాత్రం అగ్రస్థానం! - Andhra Pradesh Debt 2029 to 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.