ETV Bharat / business

సుజుకి కస్టమర్లకు అలర్ట్​ - 4 లక్షల స్కూటర్లు రీకాల్ - కారణం ఇదే! - Suzuki Recalls 4 Lakh Two Wheelers

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 3:13 PM IST

Suzuki Recalls 4 Lakh Scooters And Bikes In India : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌ సైకిల్‌ ఇండియా దాదాపు 4 లక్షల స్కూటర్లను రీకాల్‌ చేసింది. వాటిలో ప్రధానంగా యాక్సెస్‌ 125, అవెనిస్‌ 125, బర్గ్‌మాన్‌ స్ట్రీట్‌ ఉన్నాయి. ఇంతకూ వీటిని ఎందుకు రీకాల్ చేసిందంటే?

Suzuki recalls 4 lakh bikes in India
Suzuki recalls 4 lakh scooters in India (ETV Bharat)

Suzuki Recalls 4 Lakh Scooters And Bikes In India : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌ సైకిల్‌ ఇండియా దాదాపు 4 లక్షల స్కూటర్లను రీకాల్‌ చేసింది. రీకాల్ చేసిన వాటిలో ప్రధానంగా ఆ సంస్థ తయారుచేసిన యాక్సెస్‌ 125, అవెనిస్‌ 125, బర్గ్‌మాన్‌ స్ట్రీట్‌ మోడళ్లు ఉన్నాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్‌) వెబ్‌సైట్లో ఆ వివరాలను కంపెనీ పొందుపరిచింది.

రీకాల్ చేసిన వాటిలో అత్యధికంగా (2.63 లక్షల ద్విచక్ర వాహనాలు) సుజుకి యాక్సెస్‌ మోడల్‌వే ఉన్నాయి. అవెనిస్‌ 1.25 లక్షలు, బర్గ్‌మాన్‌ స్ట్రీట్ స్కూటర్లు 72 వేలు ఉన్నాయి. ఇగ్నినిషన్‌ కాయిల్‌లో వినియోగించే హై-టెన్షన్‌ కోర్డ్‌లో లోపాన్ని గుర్తించామని, అందుకే దానిని సరిచేసేందుకు ఈ రీకాల్‌ చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది. ప్రధానంగా 2022 ఏప్రిల్‌ 30 నుంచి 2022 డిసెంబర్‌ 3 మధ్య తయారుచేసిన వాహనాల్లోనే ఈ లోపాన్ని గుర్తించినట్లు సుజుకి కంపెనీ పేర్కొంది.

ఇగ్నినిషన్‌ కాయిల్‌లోని హై-టెన్షన్‌ కోర్డ్‌లో లోపం ఉంటే, ఇంజిన్‌ మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని సుజుకి కంపెనీ తెలిపింది. హై టెన్షన్‌ కోర్డ్‌ నీటిలో తడిస్తే, వాహనం స్పీడ్‌ సెన్సర్‌పై ప్రభావం పడి, స్పీడ్‌ డిస్‌ప్లే నిలిచిపోయే అవకాశం కూడా ఉందని పేర్కొంది. రీకాల్‌ ప్రక్రియ చేపట్టిన సుజుకి, ఆయా స్కూటర్లు కొనుగోలు చేసిన వాహనదారులను సంప్రదిస్తోంది. దగ్గర్లోని సర్వీస్‌ సెంటర్లో పూర్తి ఉచితంగా సంబంధిత పార్ట్‌ను రీప్లేస్‌ చేసి ఇస్తామని సుజుకి స్పష్టం చేసింది.

Suzuki Access 125 : ఈ సుజుకి యాక్సెస్​ 125 స్కూటర్​లో 124 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 6750 rpm వద్ద 8.7 PS పవర్​, 5500 rpm వద్ద 10 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్​ లీటర్​కు 45 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్​ 4 వేరియంట్స్​లో, 15 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్​ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.84,975 నుంచి రూ.94,876 వరకు ఉంటుంది.

Suzuki Burgman Street : సుజుకి బర్గ్​మ్యాన్ స్ట్రీట్ స్కూటీ లీటరు పెట్రోల్​తో 48 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది 124 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 8.7 పవర్, 10 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సుజుకి బర్గ్​మ్యాన్ స్ట్రీట్ కెర్బ్ వెయిట్ 110 కేజీలు. ఈ స్కూటీ 3 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.94,301 - రూ.1.15 లక్షల వరకు ఉంటుంది.

Suzuki Avenis 125 : సుజుకి అవెనిస్​ 125 స్కూటర్​లో 124.3 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 49.6 కి.మీ/ లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.94,507 ఉంటుంది.

మహిళా ఉద్యోగులకు, కాలేజ్ అమ్మాయిలకు ఉపయోగపడే టాప్-10 స్కూటీస్ ఇవే! - Best Scooters Or College Students

ట్యాక్సీ/క్యాబ్ బిజినెస్ చేస్తారా? టాప్-10 కమర్షియల్ కార్స్ ఇవే! - Best Commercial Car In 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.