తెలంగాణ

telangana

ETV Bharat / state

హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది: డీకే అరుణ

రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి రఘునందన్​రావుతో కలిసి హబ్సీపూర్​, ధర్మాజీపేట గ్రామాల్లో నిర్వహించిన రోడ్​షోలో పాల్గొన్నారు.

By

Published : Oct 28, 2020, 8:31 AM IST

హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది: డీకే అరుణ
హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది: డీకే అరుణ

ఎన్నికల హామీలు నెరవేర్చకుండా తెరాస నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్​రావుతో కలిసి రోడ్​షోలో పాల్గొన్నారు.

డబుల్​బెడ్​రూం ఇళ్ల పంపిణీ, రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తెరాస నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దుబ్బాకలో భాజపా గెలుస్తుందనే భయంతోనే రఘునందన్​రావు బంధువుల ఇళ్లలో సోదాలు చేశారన్నారు. రాష్ట్రం మొత్తం దుబ్బాక వైపు చూస్తుందన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: ఎన్ని ఇబ్బందులు పెట్టినా భాజపా విజయం ఖాయం: డీకే అరుణ

ABOUT THE AUTHOR

...view details