తెలంగాణ

telangana

By

Published : Jun 2, 2019, 9:38 PM IST

ETV Bharat / state

అభిమానులకు హరీశ్​రావు విజ్ఞప్తి....

సిద్దిపేట ఎమ్మెల్యే, తెరాస ముఖ్యనేత హరీశ్‌రావు తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. రేపు తన పుట్టినరోజున అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ట్వీట్ చేశారు.

అభిమానులకు హరీశ్​రావు విజ్ఞప్తి....

సిద్దిపేట ఎమ్మెల్యే, తెరాస ముఖ్యనేత హరీశ్‌రావు తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీ అందర్నీ నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్‌ 3న నేను హైదరాబాద్‌లో కానీ, సిద్దిపేటలో కానీ ఉండటం లేదు. ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండాల్సి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంటూ.. మీ అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నాని హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు.

అభిమానులకు హరీశ్​రావు విజ్ఞప్తి....

ABOUT THE AUTHOR

...view details