తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్రీడల్లో గెలుపోటములు సహజం.. స్ఫూర్తే ముఖ్యం'

క్రీడల్లో గెలుపోటములు సహజమని... గెలుపు కన్నా క్రీడాస్ఫూర్తి ముఖ్యమని అంతర్జాతీయ బాస్కెట్​బాల్​ క్రీడాకారుడు హరికృష్ణ ప్రసాద్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గస్టో 2019 జాతీయ అంతర కళాశాలల ఆహ్వాన క్రీడోత్సవాన్ని ఆయన ప్రారంభించారు.

By

Published : Dec 27, 2019, 8:26 PM IST

Updated : Dec 28, 2019, 2:27 PM IST

geetam_sports_meet
geetam_sports_meet

ఆటల ద్వారా పట్టుదల, స్నేహపూరిత స్వభావం అలవడుతుందని అంతర్జాతీయ బాస్కెట్​బాల్​ క్రీడాకాారుడు హరికృష్ణ ప్రసాద్​ అన్నారు. క్రీడలతో గెలుపోటములను సమానంగా తీసుకునే ఆత్మస్థైర్యం కలుగుతుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గస్టో 2019 జాతీయ అంతర కళాశాలల ఆహ్వాన క్రీడోత్సవాన్ని ఆయన ప్రారంభించారు.

గతంలో క్రీడా కోటా కింద రైల్వేశాఖలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేవారని చెప్పారు. రెండు...మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలు సైతం క్రీడా కోటా కింద ఉద్యోగాలు ఇస్తున్నాయని వెల్లడించారు. క్రీడల అభివృద్ధికి గీతం విశ్వవిద్యాలయం పనిచేయడం మంచి విషయమని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే క్రీడాపోటీల్లో తెలంగాణ..ఆంధ్ర..తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపు 1100 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణరావు తెలిపారు.

geetam_sports_meet

ఇవీ చూడండి : 'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు'

Last Updated : Dec 28, 2019, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details