ETV Bharat / state

'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు' - 'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు'

''మంత్రిగారు... మీ కళాశాలలోనే మహిళలకు రక్షణ కరువైతే... ఎలా? కనీసం మీరు ఇప్పటివరకైనా... దీనిపై స్పందించారా? ఓట్ల కోసం వచ్చే మీరు... ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు... మీరు వెంటనే కళాశాలకు రావాల్సిందే... '' మేడ్చల్​ జిల్లా మైసమ్మగూడలోని ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థుల మాటలివి. ఓ విద్యార్థినిపై ల్యాబ్​ ఇంఛార్జ్​ అత్యాచారం చేయడంపై ఇవాళ కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు.

students fire on minister mallareddy
'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు'
author img

By

Published : Dec 27, 2019, 2:59 PM IST

Updated : Dec 27, 2019, 3:16 PM IST

'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు'
మేడ్చల్​ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్​ కళాశాలలో ఓ విద్యార్థినిపై ల్యాబ్​ ఇంఛార్జ్​ అత్యాచార ఘటనపై విద్యార్థులు మండిపడుతున్నారు. మహిళలపై రోజు ఎన్నో ఘోరాలు జరుగుతుంటే కనీస భద్రత ఏర్పాట్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట స్వేచ్ఛగా తిరగాలంటే భయంగా ఉంటోంది... ఇప్పుడు కళాశాలకు వెళ్లాలంటే కూడా భయమేస్తోందని వాపోయారు. ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి... ఆయన కళాశాలలో ఇంత ఘోరం జరిగిన ఎందుకు స్పందించడం లేదని విద్యార్థులు మండిపడ్డారు. ఇప్పుడు మల్లారెడ్డి ఎక్కడికి వెళ్లారని ధ్వజమెత్తారు.

ఎన్ని ఫిర్యాదులు చేస్తాం... అసలు కళాశాలలో ఉమెన్​సెల్​ లేదు... ఫంక్షన్లకు వచ్చే మల్లారెడ్డి... ఇప్పుడు ఎందుకు రావడంలేదు.. ఇప్పుడు రావాల్సిందే... ఓ విద్యార్థి వేదన

అమ్మాయిలకు రక్షణ లేదా... ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఓ మంత్రి కళాశాలలోనే అమ్మాయికి రక్షణ కరువైంది... ల్యాబ్​ ఇంఛార్జ్​ని మీరైనా చంపేయండి.. లేదా మాకు అప్పజెప్పండి. --- మరో విద్యార్థి వేదన

అమ్మాయిలు సరిగ్గా బట్టలు వేసుకోండి అని చెప్తుంటారు.... మరి యూనిఫాం వేసుకున్నాక కూడా ఇలా జరిగింది? వేశాధారణలో కాదు... మీ ఆలోచనల్లో మార్పు రావాలి. --- మరో విద్యార్థి వేదన

ఇవీ చూడండి: మల్లారెడ్డి కళాశాలలో అత్యాచార ఘటనపై విద్యార్థుల ఆందోళన

Last Updated : Dec 27, 2019, 3:16 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.