క్రీడలు మానసికంగా ఉల్లాసాన్ని అందిస్తాయని మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఫ్రెండ్స్ క్లబ్లో శ్రీపాద షటిల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ షటిల్ ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంకా ఇతర క్రీడలకు అవసరమైన ఏర్పాట్లను చేసేందుకు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.
శ్రీపాద షటిల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన శ్రీధర్ బాబు - peddapalli district news
క్రీడలు మానసికంగా ఉల్లాసాన్ని అందిస్తాయని మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలోని ఫ్రెండ్స్ క్లబ్లో శ్రీపాద షటిల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కొద్దిసేపు షటిల్ ఆటను ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తన తండ్రి స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు షటిల్ ఆటను ఎంతో ఉత్సాహంగా ఆడేవారని శ్రీధర్ బాబు అన్నారు. క్రీడల గురించి యువకులను ఎంతో ప్రోత్సహించేవారని గుర్తుచేసుకున్నారు. ఇష్టమైన ఆట అని తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీలలో 64 జట్లు పాల్గొంటున్నాయి.
ఇదీ చదవండి:జల్లికట్టుకు మరో ప్రాణం బలి