కరీంనగర్ లోక్సభ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెరాస సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వరుసగా రెండోసారి విజయంపై ధీమాగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ఈ ఎన్నికల్లో గెలిచి బదులు తీర్చుకోవాలని చూస్తున్నారు. మోదీ హవా తన విజయానికి దోహదపడుతుందని భాజపా నుంచి బరిలో ఉన్న బండి సంజయ్ కుమార్ భావిస్తున్నారు. మరి ఓటరు దేవుళ్లు ఎవరికి పట్టం కట్టనున్నారో రేపు తేలనుంది.
కరీంనగర్ లోక్సభ ఎవరిది...? - ఎన్నికల ఫలితాలు
కరీంనగర్లో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని అధికార తెరాస భావిస్తుంటే... ఈసారైనా తనను విజయం వరిస్తుందని పొన్నం ప్రభాకర్ ఆశపడుతున్నారు. ఎప్పటికప్పుడు విలక్షణ తీర్పిచ్చే కరీంనగర్ ప్రజలు మరి ఎవరివైపు మొగ్గు చూపుతారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కరీంనగర్ లోక్సభ ఎవరిది...?