తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వేళ రక్తం దొరక్క తలసేమియా బాధితుల ఆవేదన

వారికి 15 రోజులకొకసారి రక్తం ఎక్కించాలి. లేదంటే కనీసం నడవలేరు.. ఆహారం తీసుకోలేరు. ఇది తలసేమియా వ్యాధిగ్రస్తుల పరిస్థితి. రెడ్​క్రాస్ వంటి రక్త నిధి కేంద్రాల వల్ల వారి ప్రాణాలు నిలుస్తున్నాయి. అయితే కరోనా కారణంగా రక్తదాతలు ముందుకు రావటం లేదు. దీనివల్ల రక్తం దొరక్క తలసేమియా బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు.

By

Published : Jul 27, 2020, 10:00 PM IST

thalassemia-patients-are-in-serious-trouble-lack-of-blood-donors
కరోనా వేళ రక్తం దొరక్క తలసేమియా బాధితుల ఆవేదన

కరోనా వేళ ఆంధ్రప్రదేశ్​లోని రక్త నిల్వల కొరత.. తలసేమియా బాధితులకు శాపంగా మారింది. రక్తం లేక రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రక్తం ఎక్కించకపోవటం వల్ల పిల్లల ఆరోగ్యం ఆందోళనగా ఉందని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్తదాతలు ముందుకు వచ్చి తమ చిన్నారులను కాపాడాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

కరోనా వేళ రక్తం దొరక్క తలసేమియా బాధితుల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details