హైదరాబాద్ హైదర్‌గూడలో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్యే గృహ సముదాయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న ఏరువాక పౌర్ణని పురస్కరించుకొని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతకు ముందు ఉదయం 6 గంటల నుంచి రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో... శాస్త్రోక్తంగా గృహ, వాస్తు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కొత్త ఇళ్లకు ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యులకు ఆధునిక హంగులతో కొత్త ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 17న సభాపతితో కలిసి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కొత్త ఇళ్లు