తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమితాబ్​​ బచ్చన్​ బ్లాగ్​కు పదకొండేళ్లు

బాలీవుడ్​ దిగ్గజం అమితాబ్​ బచ్చన్​ బ్లాగ్​కు 11 ఏళ్లు పూర్తయ్యాయి. 2008లో ప్రారంభించిన ​ఈ వేదిక ద్వారా ఆయన ఆరోగ్యం, వ్యక్తిగత విషయాలు, సినిమాలు, కార్యక్రమాల వివరాలు వెల్లడిస్తున్నారు.

By

Published : Apr 18, 2019, 9:29 PM IST

Updated : Apr 19, 2019, 7:50 AM IST

బిగ్​ బచ్చన్​ బ్లాగ్​కు పందకొండేళ్లు..

బాలీవుడ్ దిగ్గజ నటుడుఅమితాబ్‌ బచ్చన్‌ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో యువ నటులకు ఏ మాత్రం తీసిపోరు. అభిమానులతో తన మనసులో మాట పంచుకునేందుకు ఏప్రిల్‌ 17, 2008న బ్లాగ్​ ప్రారంభించారు. ఈ బ్లాగ్​ కు 11 ఏళ్లు నిండిన సందర్భంగా ట్విట్టర్​ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అమితాబ్‌ ట్విట్టర్‌ ఖాతాలోనూ చురుగ్గా ఉంటూ 36.9 మిలియన్ల ఫాలోవర్లను​ సంపాదించుకున్నారు.

" ఏప్రిల్‌ 17, 2008న ప్రారంభమైన ఈ ప్రయాణంలో విరామం, విసుగు లేకుండా ప్రతి రోజు మీ ప్రేమ పొందినందుకు మీకు నమస్కరిస్తున్నా’’
- అమితాబ్​ బచ్చన్​ , ప్రముఖ బాలీవుడ్​ నటుడు

11 నంబరును భారతదేశంలో చాలా అదృష్ట సంఖ్యగా భావిస్తారంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 76 ఏళ్ల ఈ నటుడు 4018 రోజులుగా ఈ బ్లాగ్​ను నడిపిస్తున్నారు.

అమితాబ్​ ప్రస్తుతం అయాన్​ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రణ్​బీర్​, ఆలియా భట్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే తెలుగులో 'సైరా' సినిమాలో ఆయన భాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్నారు.

Last Updated : Apr 19, 2019, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details