బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో(EX Minister Akhila Priya Case) దర్యాప్తు పూర్తయింది. కిడ్నాప్ కేసులో పోలీసులు 75 పేజీల ఛార్జ్‌షీట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌రావు సోదరులను అఖిలప్రియ అనుచరులు(EX Minister Akhila Priya Case) అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఐటీ అధికారుల పేరుతో వారి ఇంట్లోకి వెళ్లి కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. అఖిలప్రియ దంపతులతో పాటు 30 మందిపై కేసు నమోదైనట్లు వెల్లడించారు. నెలరోజుల్లో కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు వివరించారు.
EX Minister Akhila Priya Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు పూర్తి.. 75 పేజీల ఛార్జ్‌షీట్ - తెలంగాణ వార్తలు
11:28 October 19
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు పూర్తి
బోయిన్‌పల్లిలోని మనోవికాస్‌నగర్‌లో ఉంటున్న ప్రవీణ్, నవీన్, సునీల్‌లను బెదిరించి భూమి హక్కులను రాయించుకునేందుకు ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ(EX Minister Akhila Priya Case) పథకం రచించారు. వారి అనుచరులకు ఆదాయపు పన్నుశాఖ, పోలీసు అధికారులుగా వేషాలు వేయించారు. సుమారు 15 మంది నకిలీ గుర్తింపు కార్డులు ధరించి మూడు కార్లలో మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రవీణ్‌రావు నివాసానికి వెళ్లారు. ఐటీ అధికారులమంటూ నకిలీ సెర్చి వారెంట్లు చూపించారు. సోదాల మిషతో మహిళలు, పిల్లలను ఒక గదిలో ఉంచి తాళం వేశారు. అనంతరం ప్రవీణ్‌రావు సహా ముగ్గురినీ బెదిరించి కార్లలో తీసుకెళ్లారు. గంటసేపైనా అలికిడి లేకపోవడంతో ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు పక్క ఫ్లాట్‌లో వారికి ఫోన్ చేయగా.. ఓ మహిళ వచ్చి తాళం తీశారు. ప్రవీణ్, నవీన్, సునీల్ కనిపించకపోవడంతో వారు భయాందోళనలకు గురయ్యారు.
పాదచారుడు ఇచ్చిన సమాచారంతో..
కిడ్నాప్ చేసి కార్లలో తీసుకెళ్తుండగా, రాణిగంజ్ వద్ద ప్రవీణ్ గట్టిగా కేకలు వేయడంతో ఓ పాదచారి అనుమానించి డయల్ 100కు ఫోన్ చేశారు. దీంతో ఉత్తర మండలం పోలీసులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రధాన కంట్రోల్ రూంలను అప్రమత్తం చేశారు. ఈలోగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత బోయిన్‌పల్లి పోలీసులకు ఫోన్ చేసి ప్రవీణ్‌రావు ఇంట్లో ఏదో జరుగుతోందని చెప్పారు. ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ శింగన్వార్ వెళ్లి బాధితుల కుటుంబ సభ్యులతో చర్చించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 15 బృందాలను ఏర్పాటు చేశారు.
ఎనిమిది గంటలు కార్లలోనే...
కిడ్నాపర్లు బాహ్యవలయ రహదారి మీదుగా బాధితులను మహారాష్ట్రకు తరలించాలనుకున్నారు. పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో రాత్రంతా బాహ్యవలయ రహదారులపైనే సంచరించారు. చివరకు నార్సింగి-కోకాపేట మార్గంలో బాధితులను వదిలేయగా, పోలీసులు సురక్షితంగా ఇంటికి చేర్చారు. బాధితులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న భూమా అఖిలప్రియ ఇంటికి వెళ్లారు. ఆమెను, ఆమె తమ్ముడు జగద్విఖ్యాత్‌లను బోయిన్‌పల్లి పోలీస్ ఠాణాకు తరలించారు. అఖిలప్రియకు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మాదాపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్న ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీ చదవండి:
- ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త, సోదరుడి అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు
- విచారణకు పూర్తి సహకారం అందిస్తా: అఖిలప్రియ
- పోలీసు కస్టడీకి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు