తెలంగాణ

telangana

By

Published : Oct 4, 2020, 7:40 PM IST

Updated : Oct 4, 2020, 7:56 PM IST

ETV Bharat / city

సత్యాగ్రహ దీక్ష విజయవంతం చేయాలి: ఉత్తమ్

హాథ్రస్ అత్యాచార ఘటనకు నిరసనగా రేపు సాయంత్రం దీక్ష చేపట్టనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

pcc president utham kumar reddy call for sathyagraha deeksha in telanagana
సౌలభ్యం కోసమే కానీ సాహసాలు వద్దు సుమీ..

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కిసాన్, మాజ్దూర్ బచావో దివస్​పేరుతో... కలెక్టరేట్​లు, గాంధీ విగ్రాహల వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. వ్యాపారులు పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించి... బ్లాక్ మార్కెట్​కు అనుకూలంగా చట్టాలు చేయడం దారుణమన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా... తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచి ఆర్టికల్-254 ప్రకారం కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు అమలు కాకుండా తీర్మానించాలని డిమాండ్‌ చేశారు.

హాథ్రస్​లో అత్యాచారానికి గురైన యువతిని పరామర్శించేందుకు వెళ్తున్న... రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారని ఉత్తమ్​ ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక, నగరపాలక సంస్థల ఎన్నికలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నంద్ధం కావాలని పిలుపునిచ్చారు. మండలి ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైనందున... కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని ఆదేశించారు.

సత్యాగ్రహ దీక్ష విజయవంతం చేయాలి: ఉత్తమ్

ఇదీ చూడండి:తీగల వంతెనపై ఆంక్షలు... అతిక్రమిస్తే చర్యలే

Last Updated : Oct 4, 2020, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details