తెలంగాణ

telangana

By

Published : May 8, 2021, 5:26 AM IST

ETV Bharat / business

వేగంగా క్లెయిం పరిష్కారానికి ఎల్​ఐసీ వెసులుబాట్లు

పాలసీదారుల క్షేమం దృష్ట్యా.. బీమా క్లెయింలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్​ఐసీ) వెల్లడించింది. పాలసీదారులు కొవిడ్-19తో ఆసుపత్రిలో మరణించినప్పుడు.. మున్సిపల్​ మరణ ధ్రువీకరణ స్థానంలో ఆసుపత్రులు జారీ చేసిన డెత్​ సర్టిఫికెట్​తో క్లెయిం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

LIC
ఎల్​ఐసీ క్లెయిం

బీమా క్లెయింలను వేగంగా పరిష్కరించేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్​ఐసీ) ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పాలసీదారుల క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పాలసీదారులు కొవిడ్-19తో ఆసుపత్రిలో మరణించినప్పుడు.. మున్సిపల్ మరణ ధ్రువీకరణ స్థానంలో ప్రభుత్వ, ఈఎస్​ఐ, ఆర్మ్​డ్​ ఫోర్సెస్, కార్పొరేట్​ ఆసుపత్రులు జారీ చేసిన మరణ ధ్రువీకరణ, డిశ్చార్జి సమ్మరీ, డెత్ సమ్మరీలో తేదీ, సమయంతో పాటు ఉన్న పత్రాలపై ఎల్ఐసీ క్లాస్ 1 ఆఫీసర్ సంతకం చేయించి, క్లెయిం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు దహనం/ఖననం జరిగిన చోట నుంచి ఇచ్చిన ధ్రువీకరణా చెల్లుతుంది. ఇతర మరణాలకు సంబంధించి మున్సిపల్ డెత్ సర్టిఫికెట్ గతంలాగానే అవసరం ఉంటుంది.

వీడియోకాల్ ద్వారానూ..

పెట్టుబడి వెనక్కిచ్చే యాన్యుటీ పథకాలను ఎంచుకున్న వారికి అక్టోబరు 31 వరకు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగతావారు ఇ-మెయిల్​లో పంపాలి. వీడియోకాల్ ద్వారానూ ఈ ధ్రువీకరణను తీసుకునే ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. వ్యవధి తీరిన పాలసీల క్లెయింల కోసం సమీపంలోని ఎల్‌ఐసీ శాఖకు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని వెల్లడించింది. ఎల్‌ఐసీ వెబ్ సైట్లో ఆన్​లైన్​ నెఫ్ట్​కు సంబంధించిన వివరాలను తెలియజేసే వీలునూ కల్పించినట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి:దేశార్థికంపై కరోనా 2.0 ప్రభావం తక్కువే.. కానీ..

ABOUT THE AUTHOR

...view details