తెలంగాణ

telangana

ETV Bharat / business

యూరియాయేతర ఎరువులపై రాయితీ తగ్గింపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి యూరియాయేతర ఎరువులపై రాయితీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వంపై భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తాజా నిర్ణయం తర్వాత నైట్రోజన్, పాస్పరస్, పొటాష్‌, సల్ఫర్‌లపై రాయితీల వివరాలు మీ కోసం.

By

Published : Apr 22, 2020, 6:39 PM IST

Govt cuts subsidy for non-urea fertilisers, to cost Rs 22,186.55 crore for FY21
యూరియాయేతర ఎరువులపై రాయితీ తగ్గింపు

కరోనా నేపథ్యంలో ఖాజానాను పొదుపుగా వాడుకునే ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2020-21) యూరియాయేతర ఎరువులపై రాయితీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా రాయితీ కోతతో ప్రభుత్వ ఖజానాపై రూ.22,186.55 కోట్ల భారం తగ్గే అవకాశముందని అంచనా.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాయితీలు ఇలా..

ఎరువు (కిలోకు) 2020-21కి 2019-20లో
నైట్రోజన్‌ రూ.18.78 రూ.18.90
పాస్పరస్ రూ.14.88 రూ.15.21
పొటాష్‌ రూ.10.11 రూ.11.12
సల్ఫర్‌ రూ.2.37 రూ.3.56

మరిన్ని యూరియాయేతర ఎరువులైన డై-ఆమోనియం ఫాస్పెట్(డీఏపీ), మ్యూరియేట్‌ ఆఫ్ పొటాష్‌ (ఎంఓపీ), ఎన్‌పీకేల ధరలు ఎరువుల తయారీ కంపనీలే నిర్ణయిస్తాయి. వాటిపై కేంద్రం ప్రతి ఏటా స్థిరమైన రాయితీలను చెల్లిస్తుంది.

యూరియా విషయంలో ప్రభుత్వమే గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పీ)ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తి ధర కన్నా ఎంఆర్‌పీ తక్కువగా ఉంటే ఆ కంపెనీలుకు ఆ నష్టాన్ని మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఇదీ చూడండి:26 కోట్ల మంది ఫేస్​బుక్ డేటా చోరీ- రూ.41వేలకే సేల్

ABOUT THE AUTHOR

...view details