తెలంగాణ

telangana

By

Published : May 21, 2021, 11:47 AM IST

ETV Bharat / business

కొత్త పథకంతో.. క్రమం తప్పని ఆదాయం

ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురయ్యే ఆర్థిక అవసరాలను తట్టుకునేందుకు వీలుగా బీమా రక్షణ, పొదుపు కలిసుండే పాలసీని ఎక్సైడ్​ లైఫ్ ఇన్సూరెన్స్​ అందుబాటులోకి తెచ్చింది. మూడేళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీని ఎంచుకోవడానికి అర్హులు. క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశాన్ని ఈ పాలసీ కల్పిస్తోంది.

Exide Life Insurance Policy
ఎక్సైడ్​ లైఫ్ ఇన్సూరెన్స్​ పాలసీ

వివిధ దశల్లో ఎదురయ్యే ఆర్థిక అవసరాలను తట్టుకునేందుకు వీలుగా బీమా రక్షణ, పొదుపు కలిసి ఉండే పాలసీని ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తెచ్చింది. మూడేళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వారి వరకూ ఈ పాలసీని ఎంచుకునేందుకు అర్హులు. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ. రెండు రకాలుగా అందుబాటులో ఉంది.

'ఇన్‌కం' ఐచ్ఛికాన్ని ఎంచుకున్నప్పుడు.. ఆరేళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30 ఏళ్ల దాకా హామీతో కూడిన ఆదాయాన్ని అందుకోవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి తర్వాత.. పాలసీదారుడికి చెల్లించిన ప్రీమియం మొత్తం చేతికి అందుతుంది. క్రమం తప్పకుండా అదనపు ఆదాయం రావాలని కోరుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లల చదువులు, వారి వివాహంలాంటి ఖర్చులను తట్టుకునేందుకు ఇది సహాయపడుతుంది.

'లంప్‌ సమ్‌'లో ఆరేళ్ల ప్రీమియం చెల్లించిన తర్వాత.. మెచ్యూరిటీ బెనిఫిట్‌ కింద ఏకమొత్తంలో చెల్లింపు అందిస్తారు. మొత్తం పాలసీ వ్యవధి అంతా జీవిత బీమా రక్షణ కొనసాగుతుంది. ఈ పాలసీలో చేరాలనుకునే వారికి కనీస వయసు 11 ఏళ్లు ఉండాలి. పొదుపుతో పాటు జీవిత బీమా రక్షణ అందించేలా ఈ పాలసీని రూపొందించినట్లు ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అంటోంది.

ఇదీ చదవండి:ఇంట్లోనే కొవిడ్​ చికిత్స- బీమా పరిహారం పొందడమెలా?

ABOUT THE AUTHOR

...view details