తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2023, 1:45 PM IST

ETV Bharat / bharat

రోడ్డుపై గుంతలకు మహిళా సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ బలి.. అదుపుతప్పి లారీని ఢీకొట్టిన స్కూటీ

రోడ్డుపై గుంతల కారణంగా ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పొయింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. మరోవైపు చక్కెర తక్కువైందని హోటల్​ యజమానిని పొడిచాడు ఓ వ్యక్తి. కేరళలో ఈ షాకింగ్​ ఘటన జరిగింది.

woman-software-killed-hit-by-truck-in-tamil-nadu
తమిళనాడులో ట్రక్కు ఢీకొని మహిళ సాఫ్ట్​వేర్ ​మృతి

తమిళనాడులో రోడ్డుపై ఉన్న గుంతలు.. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ మరణానికి కారణం అయ్యాయి. స్కూటీపై వెళుతున్న ఓ మహిళ.. గుంతలమయంగా ఉన్న రోడ్డుపై ప్రయాణిస్తూ, అదుపుతప్పి నేరుగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆమె మృతి చెందింది. చెన్నైలోని మధురవాయల్ ప్రాంతంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూనమల్లి పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది. సాఫ్ట్​వేర్​​ ఉద్యోగినిగా పనిచేస్తున్న శోభన అనే మహిళ ప్రమాదంలో చనిపోయింది. మహిళ తన సోదరుడితో కలిసి స్కూటీపై వెళుతోంది. రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా.. స్కూటీ అదుపు తప్పింది. అనంతరం ఆమె వాహనం నేరుగా వెళ్లి ట్రక్కుకు ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి సోదరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
శోభన మృతితో స్థానిక అధికారులు స్పందించారు. ప్రమాదానికి కారణమైన రోడ్డుకు బుధవారం మరమ్మతులు చేయించారు. జేసీబీల సాయంతో గుంతలను పూడ్చారు.

మహిళ సాఫ్ట్​వేర్ ​ఉద్యోగిని స్కూటీ
ట్రక్కు
రోడ్డుకు మరమ్మతులు

టీలో చక్కెర తక్కువైందని కత్తితో దాడి..
కేరళలో షాకింగ్​ ఘటన జరిగింది. టీలో చక్కెర తక్కువైందని హోటల్​ యజమానిని పొడిచాడు ఓ వ్యక్తి. మలప్పురం టౌన్​లోని ఓ రెస్టారెంట్​లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం బాధితుడు విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని సుబైర్​గా గుర్తించారు పోలీసులు. రెస్టారెంట్​ యజమాని మనఫ్​పై నిందితుడు పలుమార్లు కత్తితో దాడి చేశాడు. టీలో చక్కెర తక్కువైందని.. మొదట వీళ్లిద్దరికీ గొడవ జరిగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన నిందితుడు.. కొద్దిసేపటికి కత్తితో తిరిగొచ్చాడు. మనఫ్​పై తీవ్రంగా దాడి చేశాడు.
గాయపడ్డ మనఫ్​ను తిరుర్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మంజేరి మెడికల్ కాలేజీలో చేర్పించారు. బాధితుడి పరిస్థితి మరింత విషమించింది. దీంతో అతడిని కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్​కు తరలించారు. ఘటనపై స్థానిక వ్యాపారులు ఆందోళన నిర్వహించారు.

కుక్కలను కాల్చి చంపిన షూటర్లు..
బిహార్​లో మనుషులను చంపుతున్న 16 శునకాలను షూటర్లు కాల్చి చంపారు. పట్నా నుంచి వచ్చిన జాతీయ షూటర్ల బృందం కుక్కలను కాల్చి చంపింది. దీంతో బెగుసరాయ్ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది నెలలుగా ఈ కుక్కలు.. ఆ ప్రాంత వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఈ కుక్కల కారణంగా ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. 35 నుంచి 40 మందిపై కుక్కలు తీవ్రంగా దాడి చేశాయని వారు అంటున్నారు. దీంతో ఆ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధులు.. కుక్కల నుంచి విముక్తి కలిగించాల్సిందిగా​ జిల్లా కలెక్టర్​ను కోరారు. కలెక్టర్​ ఆదేశాల ప్రకారం.. కుక్కలను నేషనల్​ షూటర్ల బృందం కాల్చిచంపింది. అటవీ అధికారుల అధ్వర్యంలో ఆ కాల్చివేతలు జరిగాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details