తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం: సుఖ్​బీర్​ సింగ్​

రైతుల కోసం తమ పార్టీ ఏ త్యాగానికైనా సిద్ధమని పేర్కొన్నారు శిరోమణి అకాలిదళ్​(ఎస్​ఏడీ) అధ్యక్షుడు సుఖ్​బీర్​ సింగ్​. ఎన్​డీఏలో కొనసాగాలా వద్దా అనే అంశంలో పార్టీతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

By

Published : Sep 17, 2020, 11:05 PM IST

SAD ready to make any sacrifice for farmer
రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం: సుఖ్​బీర్​ సింగ్​

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తోంది భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలిదళ్​​(ఎస్​ఏడీ). ఈ సందర్భంగా ఎన్​డీఏలో కొనసాగాలా వద్దా అనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ అధ్యక్షుడు సుఖ్​బీర్​ సింగ్​. పార్టీతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పార్లమెంట్​లో తమ పార్టీ అభిమతాన్ని వెల్లడించిన సుఖ్​బీర్​.. సమావేశాల అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా తమ పార్టీ సిద్ధమని వెల్లడించారు.

అంతకు ముందు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఎస్​ఏడీ నేత హర్​​సిమ్రత్​ కౌర్​ బాదల్. తన రాజీనామాను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు హర్​సిమ్రత్​. రైతుల సమస్యలు పరిష్కరించకుండా వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిన ఈ ప్రభుత్వంలో భాగం కావాలనుకోవట్లేదని ఆమె పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లుల్లో రెండింటికి గురువారం మూజువాణి ఓటు​ ద్వారా ఆమోదం తెలిపింది లోక్​సభ. మరో బిల్లు మంగళవారమే దిగువ సభలో గట్టెక్కింది.

ఇదీ చూడండి: కేంద్రమంత్రి హర్​సిమ్రత్​ రాజీనామా.. కారణమిదే?

ABOUT THE AUTHOR

...view details