తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో మూడో కూటమికి అవకాశం లేదు'

లోక్​సభ ఎన్నికల పోలింగ్​ అనంతరం మూడో కూటమికి అవకాశం లేదని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​ అభిప్రాయపడ్డారు. భాజపా, కాంగ్రెస్​లను మినహాయించి కూటమి ఏర్పాటు చేయటం అసాధ్యమని పేర్కొన్నారు.

By

Published : May 14, 2019, 12:58 PM IST

స్టాలిన్

దేశంలో భాజపా, కాంగ్రెసేతర ​కూటమి ఏర్పాటు అసాధ్యమని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​ అభిప్రాయపడ్డారు. ఫెడరల్​ ఫ్రంట్​కు ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​ రావుతో భేటీ అయిన మరుసటి రోజే స్టాలిన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్​తో భేటీపై స్పందించిన స్టాలిన్​.. ఫెడరల్​ ఫ్రంట్ విషయమై సమావేశమవ్వలేదని స్పష్టం చేశారు.

"కూటమి చర్చల విషయమై కేసీఆర్​ ఇక్కడికి రాలేదు. ఆలయాలను దర్శించే పనిలో భాగంగానే తమిళనాడుకు ఆయన వచ్చారు. అదే సమయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పరిస్థితులు చూస్తుంటే మూడో కూటమికి అవకాశం లేనట్టే కనిపిస్తోంది. అయినా ఎన్నికల ఫలితాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటాం."

-ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు ​

ఇదీ చూడండి: కన్నడనాట ఆగని 'సంకీర్ణ కూటమి' యుద్ధం

ABOUT THE AUTHOR

...view details