తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోనే ఎత్తయిన మనిషి నడుముకు శస్త్రచికిత్స

భారతదేశంలో అత్యంత ఎత్తయిన మనిషిగా ప్రసిద్ధిగాంచిన ధర్మేంద్ర ప్రతాప్​ సింగ్​కు ఇటీవల తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రి ఆయనకు ఉచితంగా ఈ చికిత్స చేసింది.

By

Published : Sep 27, 2019, 5:32 AM IST

Updated : Oct 2, 2019, 4:24 AM IST

దేశంలోనే ఎత్తయిన మనిషి నడుముకు శస్త్రచికిత్స

దేశంలోనే ఎత్తయిన మనిషి నడుముకు శస్త్రచికిత్స

ధర్మేంద్ర ప్రతాప్​ సింగ్​... ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​ వాసి. వయస్సు 43. ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం. దేశంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తిగా గుర్తింపు పొందారాయన.

ధర్మేంద్రకు ఇటీవలే ఓ శస్త్రచికిత్స జరిగింది. గుజరాత్​ అహ్మదాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి... ఆయనకు తుంటి మార్పిడి ఆపరేషన్​ను ఆగస్టు 26న విజయవంతంగా చేసింది. ఆయన ఇప్పటికి దాదాపు పూర్తిగా కోలుకున్నారు.

కొంతకాలం క్రితం జరిగిన ఓ ప్రమాదంలో ధర్మేంద్ర తుంటి దెబ్బతింది. తర్వాత ఆయన తీవ్రమైన నడుము నొప్పితో బాధపడ్డారు. చికిత్స చేయలేమని లఖ్​నవూలోని వైద్యులు చేతులెత్తేశారు. ఫలితంగా ధర్మేంద్ర అహ్మదాబాద్​ చేరుకున్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉచితంగా వైద్యం చేసింది కేడీ ఆస్పత్రి.

తుంటి మార్పిడి శస్త్రచికిత్సలో నడుము భాగంలో అసెటేబులార్ కప్పులు అమర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్​లో అందుబాటులో ఉన్నవి... ధర్మేంద్రకు సరిపోలేదు. అందుకే చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించారు వైద్యులు.

"శస్త్రచికిత్స చేయటానికి 2-3 గంటలు పట్టింది. నడుము భాగంలోని కప్పు​ సైజ్​ పెద్దగా ఉండటం వల్ల అత్యంత జాగ్రత్తగా ఈ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. తుంటి మార్పిడి​ సాధారణ వ్యక్తికి జరిగితే సాయంత్రానికల్లా వారు నడవగలరు. కానీ ధర్మేంద్ర నడవటానికి 3 వారాలు పట్టింది."

-డాక్టర్ అతీత్ శర్మ, వైద్యుడు.

ఇదీ చూడండి : నగరంపై తేనెటీగలు దండెత్తితే ఇలానే ఉంటుంది...

Last Updated : Oct 2, 2019, 4:24 AM IST

ABOUT THE AUTHOR

...view details