కరోనాపై గాయనీ శోభరాజ్ పాట - కొవిడ్‌పై గాయనీ శోభరాజ్ పాట
కరోనా మహమ్మారి రెండో దశలో వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న తరుణంలో ప్రముఖ గాయనీ శోభరాజ్ పాట రూపంలో కొవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లు కదిలి రావద్దు... ఎవరి దగ్గరికీ పొవద్దూ అంటూ ఓ పాటను పాడారు. కరోనాను తిప్పి కొట్టాలి... లోకానికి దివిటి పట్టాలంటూ చైతన్యం కల్పించారు. అవసరం ఉంటే తప్ప ఎవరూ బయటి రావద్దని... ప్రతీ ఒక్కరూ స్వీయ రక్షణతోపాటు ప్రభుత్వ నియమాలు, నిబంధనలు పాటించాలని కోరారు. అజాగ్రత్తే అనార్థాలకు కారణమని... బతికి ఉంటేనే మనకు భవిష్యత్ ఉంటుందన్నారు.