ఏరువాక పనులకు వేళాయే..! - guntur
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలో శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏరువాక పనులను ప్రారంభించారు. స్థానిక శివాలయంలో వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించిన అనంతరం రైతులతో కలిసి ఎడ్లబండిపై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అన్నదాతలను ఆదుకునేందుకు అక్టోబర్ నుంచి రైతు భరోసా కార్యక్రమం చేపట్టనున్నట్లు రామకృష్ణ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన్ని పండువలా చేస్తామన్నారు. అనంతరం పొలంలో స్వయంగా అరక దున్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లె శాసనసభ్యులు అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.