రావణ, మయూర వాహనాలపై ఆదిదంపతులు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజున.. గాంధర్వ రాత్రిని పురస్కరించుకుని రావణ, మయూర వాహనాలపై స్వామి, అమ్మవార్లను ఊరేగించారు. ఆలయంలోని అలంకార మండపం నుంచి బయలుదేరిన ఆదిదంపతుల విహారం.. మాఢవీధుల్లో కన్నుల పండువగా సాగింది. ఆదిదంపతుల దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లగా.. శ్రీకాళహస్తి మాఢవీధులు కిటకిటలాడాయి.