Prathidwani: మదుపర్ల రక్తకన్నీరుకు.. ప్రధాన కారణాలు ఏమిటి?
Prathidwani: బేర్ పంజా దెబ్బకు మార్కెట్‌లు విలవిల్లాడాయి. కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్‌నే చూశాయి. నిమిషాల వ్యవధిలో లక్షల కోట్ల సంపద ఆవిరై.. మదుపర్లకు రక్తకన్నీరే మిగిలింది. గతవారం భారీనష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ఇంకా ఒమిక్రాన్ భయాలు కొనసాగడం.. అంతర్జాతీయంగా ఆంక్షలు, లాడ్‌డౌన్ సంకేతాలు, ఫెడ్ నిర్ణయాలతో మళ్లీ భారీగా నష్టపోయాయి. ఇటీవలి కాలంలో కనీవినీ ఎరగని తీవ్రనష్టాల నేపథ్యంలో మదుపర్ల భవితవ్యం ఏమిటి? అసలు అమెరికా వడ్డీ రేట్లు ఇక్కడి స్టాక్ సూచీలను ఇంతగా ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? అమ్మకాల ఒత్తిడి పరిస్థితుల్లో ఏం చేస్తే పెట్టిన పెట్టుబడులకు భద్రత ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని...