వైరల్ వీడియో: అద్దె చెల్లించలేదని యువకుడ్ని చితకబాదారు..! - నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ వీడియో
నెల్లూరు జిల్లాలో ఓ యువకుడిని చితకబాదిన వీడియో వైరల్ అయ్యింది. తొలుత బెట్టింగ్ వివాదంతో యువకుడిని కొట్టారని వార్తలు వచ్చినా....బెట్టింగ్‌కు సంబంధం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలు గతేడాది జరిగాయని వెల్లడించారు. ఆర్థిక కారణాలతోనే దాడి జరిగిందని తేల్చారు. హోటల్ బిల్లు, కారు అద్దె వివాదాలతో దాడులు జరిగాయన్న పోలీసులు.. దాడి చేసిన రాజశేఖర్‌ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు నిందితులు కిరణ్, రంజిత్ పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
Last Updated : Nov 17, 2020, 7:31 PM IST