ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Yuvagalam

ETV Bharat / videos

Special SIT on YSRCP టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల అవినీతిపై సిట్ ఏర్పాటు: నారా లోకేశ్

By

Published : Jul 1, 2023, 12:49 PM IST

Special SIT on YSRCP leaders తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్..142వ రోజు పాదయాత్రలో సంచలన ప్రకటన చేశారు. ''2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతిపై ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తాం. వారి అక్రమ ఆస్తులపై విచారణ జరిపిస్తాం. వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మును రికవరీ చేస్తాం. రికవరీ చేసిన ఆ సొమ్మును ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తాం. అంతేకాదు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్దతి ప్రకారం.. ఐదు సంవతర్సాల్లో పేద ప్రజలకు ఇల్లు కట్టించే బాధ్యతను మేము తీసుకుంటాం.'' అని ఆయన ప్రకటించారు. 

1,868.3 కి.మీ. పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర.. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర అనేక సవాళ్లను, అడ్డంకులను, ఆంక్షలను అధికమిస్తూ.. నిన్నటితో 142 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో నేటి (143వ రోజు) యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో సాగనుంది. ఐదు రోజుల పాటు గూడూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన లోకేశ్.. వరగలి, లింగవరం, సింహపురి పవర్ ప్లాంట్, తమ్మినపట్నం, గుమ్మలదిబ్బ, కృష్ణపట్నం దక్షిణ ద్వారం మీదుగా గోపాలపురం విడిది కేంద్రానికి చేరుకున్నారు. నిన్నటి పాదయాత్రలో యువనేత లోకేశ్.. 15.3 కి.మీ. పాదయాత్ర చేశారు. దీంతో ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1,868.3 కి.మీ. పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నేటి యువగళం పాదయాత్ర సర్వేపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ముత్తుకూరులో సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభలో నారా లోకేశ్ పాల్గొని ప్రసంగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details