టీడీపీ ఫ్లెక్సీలను చింపేసిన వైసీపీ శ్రేణులు - ఇరు పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం - టీడీపీ ఫ్లెక్సీలను చింపేసిన వైసీపీ శ్రేణులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 5:48 PM IST
YCP Leaders Tear The TDP leaders Flexies Fight In Surampalli: కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు చింపేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే వైసీపీ శ్రేణులు చింపేసి వైస్సార్సీపీ నాయకులు ఉన్న ఫ్లెక్సీలను కట్టారు. దీంతో టీడీపీ ఫ్లెక్సీలను చింపివేయటం చూసిన ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఉద్వేగంతో రగిలిపోయి వైసీపీ ఫ్లెక్సీలను చింపేశారు.
దీంతో స్థానికంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. స్థానికులు సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల పార్టీ కార్యకర్తలను అక్కడ నుంచి చెదరగొట్టారు. ఫ్లెక్సీలు చింపిన వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.