ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP leaders attacked woman

ETV Bharat / videos

YCP leaders attacked on woman: చాకిరాలలో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. మహిళపై తీవ్రంగా దాడి - YCP leaders attacked on woman in chakirala

By

Published : Aug 2, 2023, 6:04 PM IST

YCP leaders attacked on woman in prakasam district: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. పార్టీ అండదండలతో బడుగు, బలహీన వర్గాల భూములను అక్రమంగా లాక్కుంటూ.. దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. అడ్డుపడిన భూ యజమానులను, మహిళలను, బంధుమిత్రులను చితకబాదుతున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి.. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాలలో వైసీపీ నేతలు ఓ మహిళపై, ఆమె తమ్ముడిపై తీవ్రంగా దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. తీవ్రంగా గాయపరిచారు. దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ బాధితులను బెదిరించారు.  

భూ యజమానిపై వైసీపీ నాయకులు దాడి..ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాలలో చెన్నకేశవులు కుటుంబానికి మరో కుటుంబానికి మధ్య గతకొంత కాలంగా భూ వివాదం జరుగుతోంది. ఈ భూ వివాదంపై కోర్టులో విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో కోర్టు తీర్పు వెలువడగా ముందే వైసీపీ నాయకులు భూమిలోకి ప్రవేశించి.. ఈ భూమి తమదే అంటూ ట్రాక్టర్లతో చదును చేయసాగారు. దీంతో కోర్టు పరిధిలో ఉన్న తమ భూమిని ఎందుకు చదును చేస్తున్నారు..? అంటూ భూ యజమాని కుమారి వారికి అడ్డుపడ్డారు. దీంతో ఆగ్రహించిన కబ్జాదారులు.. మహిళపై దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. తీవ్రంగా గాయపరిచారు. అడ్డం వచ్చిన కుమారి తమ్ముడిని సైతం తీవ్రంగా గాయపరిచారు. గమనించిన చుట్టుప్రక్కల స్థానికులు అడ్డుకుని.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details