కళ్లెదుట అక్రమాలనూ నిలువరించని పోలీసులు - స్టేషన్ ఎదుట ఆందోళన - ఏలూరు తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 12:48 PM IST
YCP Illegal Mining in Eluru District :అక్రమంగా మైనింగ్ చేస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ అర్ధరాత్రి నుంచి ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ బైఠాయించారు. పోలవరం కుడి కాలువ వద్ద వైసీపీ నేతలు భారీగా గ్రావెల్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్‌ను అడ్డుకున్న చింతమనేని... వైసీపీ నేతలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోకపోవటంతో 10 లారీలు, 2 జేసీబీలు, 2 ట్రాక్టర్లను చింతమనేని పట్టుకున్నారు. వాహనాలతో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ నేతలపై కేసునమోదు చేసే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు.
TDP Chinthamaneni Prabhakar Stoped Mining Lorries : అక్రమంగా మైనింగ్ చేస్తున్నవారిని అదుపులోకి తీసుకునేంతవరకు తాను అక్కడే ఉంటానని పోలీసులతో అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం పై ఆందోళన వ్యక్తం చేశాడు. ఇక చేసేదేమీ లేక కళ్ల ముందే అక్రమంగా మైనింగ్ లారీలు తిరుగుతుండగా.. చింతమనేని రంగంలోకి దిగారు. అక్రమ గ్రావెల్ మైనింగ్ వాహనాలను అడ్డుకొని స్థానిక పోలీసు స్టేషన్ ముందు ఉంచారు. నేత చింతమనేని ప్రభాకర్ సహా పలువురు పీఎస్ ముందే బైఠాయించారు.