రేషన్ బియ్యం పంపిణీ నిలిపేశారని గ్రామపంచాయతీకి తాళం వేసి మహిళల నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 10:13 PM IST
Women Protest Against on Ration Rice not Supplied: తమకు రేషన్ బియ్యం అందడం లేదని అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో మహిళలు నిరసనకు దిగారు. తమకు రేషన్ డీలర్ బియ్యం అందించడం లేదని గ్రామపంచాయతి కార్యాలయానికి తాళం వేసి ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయం ముందు బైఠాయించగా విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకోగా.. గ్రామస్థులు, సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది.
కంబదూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామంలోని మహిళలు.. రేషన్ బియ్యం అందడం లేదని అందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. సమస్యపై ఆరా తీయగా.. తమకు మూడు నెలలుగా డీలర్ రేషన్ పంపిణీ చేయడం లేదని.. తాము ఏం తినాలని అధికారులను నిలదీశారు. ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో మహిళలు, రెవెన్యూ అధికారులకు మధ్య చిన్న వివాదం చెలరేగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రేషన్ అందించాలని అన్నారు.
TAGGED:
నిరసన వ్యక్తం చేసిన మహిళలు