ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మద్యం లోడ్​తో వెళ్తున్న డీసీఎం బోల్తా - మద్యం సీసాలను పట్టుకుని వెళ్లిన స్థానికులు - డిసిఎం ప్రమాదం

🎬 Watch Now: Feature Video

Truck Carrying Alcohol Overturns in vishaka

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 5:05 PM IST

Truck Carrying Alcohol Overturns in vishaka: మద్యం లోడ్​తో వెళ్తున్న ఓ డీసీఎం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఇంకెముంది, ముందే మందు... అదీ మద్యం రేట్లు ఆకాశాన్ని తాకుతున్న రాష్ట్రంలో.. రోడ్డుపై మద్యం సీసాలు పడి కనిపించడంతో మందు బాబులు ఊరుకుంటారా! అటుగా వెళ్తున్న మద్యం ప్రియులు తలా ఓ సీసాను తీసుకెళ్లె ప్రయత్నం చేశారు. మెుదట డీసీఎం డ్రైవర్ వారిని వారించే ప్రయత్నం చేశాడు. ఇక చేసేది ఎం లేక... పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టడంతో పాటుగా... మద్యం తీసుకెళ్లె వారిని అడ్డుకున్నారు. 

విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మాది వద్ద జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు మద్యం లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  కొన్ని మద్యం సీసాలు పగిలిపోయాయి.  అదే సమయంలో కొందరు స్ధానికులు రోడ్డుపై పడ్డ మద్యం సీసాలను తీకుకెళ్లే ప్రయత్నం చేశారు. మెుదట మద్యం బాటిల్లను తీసుకెళ్తున్న వారిని డ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మద్యం తీసుకెళ్ల డానికి జనం ఎగబడటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు  ఆ ప్రాంతానికి చెరుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల సహాయంతో ... ట్రాఫిక్​​ను క్లియర్ చేసి క్రెయిన్ ద్వారా ఆ డీసీఎం ను పైకి లేపారు. అందులోని సరుకును వేరే వాహనంలోకి మర్చారు.  

ABOUT THE AUTHOR

...view details