ఆంధ్రప్రదేశ్

andhra pradesh

salakatla_brahmotsavam

ETV Bharat / videos

Tirumala Brahmotsavalu 2023 Updates: తిరుమలలో ఈ నెల 18నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి - ఏపీ తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 5:06 PM IST

Tirumala Brahmotsavalu 2023 Updates:తిరుమలలోఈ నెల 18న మొదలయ్యే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం తితిదే భద్రత అధికారులు, ఉన్నత అధికారులతో కలిసి ఆయన ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీలను పరిశీలించారు. సెప్టెంబర్ 22న జరిగే గరుడ సేవ రాత్రి 7 గంటలకు మొదలవుతుందని.. రాత్రి రెండు గంటలు అయిన భక్తులు వాహనసేవను తిలకించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గరుడ రోజున గ్యాలరీలో కూర్చునేందుకు రెండు లక్షల మందికి అవకాశం ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో బయట ఉన్న భక్తులు వాహన సేవ మొదలయ్యాక సుపథం నుంచి క్యూలైనులోకి రావాలన్నారు. సౌత్, వెస్ట్ ఉన్న భక్తులు గోవింద నిలయం నుంచి క్యూ లైనులోకి రావాలని, నార్త్, ఈస్ట్ ఒక ఎంట్రీ పాయింట్ ద్వారా వచ్చి వాహన సేవను చూడాలన్నారు. గరుడ సేవరోజున భక్తులు సమన్వయం పాటించాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details