ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Naseer on New Registration System 'కమీషన్ల కోసమే సీఎం జగన్ నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చారు.'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 4:44 PM IST

TDP_Naseer_on_New_Registration_System

TDP Naseer on New Registration System: నూతన రిజిస్ట్రేషన్ విధానంలో కుట్ర దాగి ఉందని తెలుగుదేశం అనుమానం వ్యక్తంచేసింది. ఎంతో విలువైన ప్రజల ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసే అధికారం ప్రైవేటు సంస్థకు అప్పగించడం దారుణమని.. టీడీపీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న రిజిస్ట్రేషన్ విధానాన్ని కాదని.. కేవలం కమీషన్ల కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి జిరాక్స్ ఆధారిత రిజిస్ట్రేషన్ పాలసీ తీసుకొచ్చాడని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానం మొత్తం లోపభూయిష్టమేనని ధ్వజమెత్తారు. 24 ఏళ్లనుంచి రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా సేవలందిస్తున్న నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్​ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందని ప్రశ్నించారు. ఎలాంటి అనుభవంలేని, డేటా రికవరీ చేయలేని క్రిటికల్ రివర్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ సంస్థకు రిజిస్ట్రేషన్ల బాధ్యత అప్పగించడం ప్రజల ఆస్తులతో చెలగాటమాడటం కాదా అని దుయ్యబట్టారు. కొత్త విధానంలో ఆన్​లైన్లో క్రయ విక్రయదారులు నిర్ణీత రుసుము కడితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అంటున్నారు.. అదే జరిగితే అనంతరం తలెత్తే వివాదాలు, సమస్యలకు ఎవరు బాధ్యులవుతారని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details