ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leader Pattabhi Ram Sensational Comments

ETV Bharat / videos

TDP Leader Pattabhi Ram Sensational Comments: సీమెన్స్‌ కంపెనీ అంశంపై.. నరేంద్రమోదీని అడిగే ధైర్యం జగన్‌కు ఉందా ?: పట్టాభి - ఎంఓయూ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2023, 3:38 PM IST

TDP Leader Pattabhi Ram Sensational Comments: సీమెన్స్‌ కంపెనీ... గుజరాత్‌లో ఏ విధంగా ఒప్పందం చేసుకుందో.. ఏపీలోనూ అదే రీతిలో ఎంఓయూ(MOU) కుదుర్చుకున్నట్లు తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి రామ్ తెలిపారు. రాష్ట్రంలో 42 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లకు..  కేవలం రూ. 371 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అదే గుజరాత్‌లో కేవలం 5 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్​లకు.. రూ. 489 కోట్లు ఖర్చు చేశారని, దీనిపై మోదీని అడిగే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. గుజరాత్‌లో సైతం  ఎక్కడా టెండర్లు పిలవలేదని పేర్కొన్నారు.  

అవినీతి బురద వేస్తారా?:  ఆంధ్రప్రదేశ్​లో  42 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తే అవినీతి బురద వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని  సిద్ధ రామయ్య ప్రభుత్వం 2017లో  ప్రాజెక్టుపై సంతకం చేసిందని పేర్కొన్నారు.  రూ.2 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.1822 కోట్లు 30 శాతం సీమెన్స్‌ పెట్టుకుంటే, 10 శాతం కర్ణాటక ప్రభుత్వం రూ.220 కోట్లు పెట్టేలా ఒప్పందమైందని తెలిపారు.  కర్ణాటక రాష్ట్రం కూడా  తప్పు చేసిందని జగన్‌ ప్రశ్నించగలరా? అంటూ పట్టాభి రామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బైజూస్‌తో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు..  టెండర్ ఎందుకు పిలవలేదని పట్టాభి ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details