ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Railway_Employees_Protested_Against_Privatization_of_Railways

ETV Bharat / videos

రైల్వే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని ఉద్యోగుల ఆందోళన - Railway Employees Protest in vijayanagaram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 7:10 PM IST

Railway Employees Protested Against Privatization of Railways: రైల్వేల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైల్వే ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విజయవాడ, నెల్లూరు, విజయనగరం రైల్వే స్టేషన్‌ల ఎదుట (CITU) సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైల్వే ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు.

Railway Employees Protest Under CITU: రైల్వే వ్యవస్థను నీరు గార్చేందుకే కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ డిమాండ్​ చేశారు. ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు సేవలందిస్తున్న రైల్వే ను భూస్థాపితం చేసేందుకు ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు.  ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిపోతుందని, దాని వల్లే ప్రమాదాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రైవేటీకరణ విధానాల వల్ల ఒడిశా బాలాసోర్, జిల్లాలోని అలమండ ప్రమాదాలు నిదర్శనమని తెలిపారు. దేశవ్యాప్తంగా 150 స్టేషన్లను ప్రైవేట్​పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందన్నారు. రైల్వేలో  ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిపోతుందన్నారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, కేంద్ర కార్యదర్శి, లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్​కు చెందిన వెంకటేశ్వర్లు, రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details