ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సెజ్​లో ఎంఐపీ ఏర్పాటుపై గ్రామస్థుల వ్యతిరేకత

ETV Bharat / videos

KAKINADA SEZ REFERENDUM: కాకినాడ సెజ్​లో ఎంఐపీ ఏర్పాటుపై ప్రజాగ్రహం

By

Published : Jun 6, 2023, 3:57 PM IST

KAKINADA SEZ REFERENDUM: కాకినాడ సెజ్​లో ఎంఐపీ ఏర్పాటుపై.. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాకినాడ సెజ్‌లో 16 వందల 48 హెక్టార్లలో 2వేల 500 కోట్ల రూపాయల వ్యయంతో.. మల్టీ ప్రాడెక్ట్స్ ఇండస్ట్రియల్ పార్కు(ఎంఐపీ) ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇందుకోసం.. అధికారులు తొండంగి మండలం కె.పెరుమాళ్లపురంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణకు తలపెట్టారు. కాకినాడలోని కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఎ.వి.నగరం, పెరుమాళ్లపురం, తొండంగి కోదాడ, రమణక్కపేట, మూలపేట గ్రామస్థులు పెద్ద సంఖ్యలో.. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యారు. అనుమానాలు, అపోహలు ఉంటే తెలపాలని ఈ సందర్భంగా కలెక్టర్ కృత్తికా శుక్లా గ్రామస్థులను కోరారు. కాగా.. సెజ్ అధికారులు కూడా.. వివరాలు వెల్లడిస్తున్న సమయంలో గ్రామస్థులు ఒక్కసారిగా నినాదాలు చేపట్టారు. ఎంఐపీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. కాలుష్య పరిశ్రమల వల్ల తమ భూములు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ యత్నించారు. పిఠాపురం నుంచి బయల్దేరిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.  

ABOUT THE AUTHOR

...view details