PRATHIDWANI నేతలపై కేసుల మాఫీకి చట్టం ఏం చెబుతోంది
పాలనలో అంతా పారదర్శకమని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న వ్యవహారాలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎప్పటికప్పుడు నిలువరిస్తోంది. ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరించుకూంటూ ప్రభుత్వం రహస్యంగా జారీ చేసిన జీవోలపై హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దీనిపై పౌర సమాజం నుంచి పిటిషన్లు దాఖలై విచారణ జరగడంతో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకే వివరణ ఇచ్చింది. సొంత పార్టీ నేతలపై కేసుల మాఫీ జీవో ఇచ్చిన ప్రభుత్వం కోర్టు ముందు ఎందుకు తన నిర్ణయం మార్చుకుంది? నేతలపై కేసులు మాఫీ చేయడానికి చట్టం ఏం చెబుతోంది. కేసుల మాఫీ జీవోలో వైకాపా ప్రభుత్వం వాటిని పాటించిందా? ఈ కేసుల్లో నిష్పాక్షిక విచారణకు ఎలాంటి చర్యలు అవసరం అనే దానిపై నేటి ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST