PRATHIDWANI రైతులను నిలువునా ముంచేసిన మాండౌస్ తుపాను - తుపానుతో నష్టపోయిన రైతులు
మాండౌస్ తుపాను రైతులను నిలువునా ముంచేసింది. వరి, మిరప, పత్తి, సెనగ, పొగాకు, మినుము సహా ఉద్యాన పంటలనూ తీవ్రంగా దెబ్బతీసింది. పంట చేతికొచ్చే దశలో విరుచుకుపడిన వాన ధాటికి... పెట్టుబడులూ కోల్పోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా సుమారు 5 లక్షల ఎకరాలకుపైనే పంటలు నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా. వరుస ఆటుపోట్లతో అల్లాడుతున్న రైతులు.. ప్రభుత్వం నుంచి తక్షణం కోరుకుంటున్న సాయం ఏమిటి.. ఈ కష్టం నుంచి రైతులు గట్టెక్కాలంటే ఏం చేయాలి.. ఇదేఅంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST