Prathidhwani: ఉద్యోగుల జీతాలకు దిక్కు లేదు.. ప్రకటనలకు భారీగా చెల్లింపులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 9:24 PM IST
Prathidhwani:వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్డగోలుగా పార్టీ ప్రచారం, వ్యక్తిపూజ కార్యక్రమాలకు మళ్లిస్తున్నట్లు మరో వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఐప్యాక్ చుట్టూ రేగిన దుమారం ఇంకా చల్లారక ముందే.. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ రూపంలో తెరపైకి వచ్చాయీ ఆరోపణలు. ఏపీడీసీ ప్రకటనల పేరుతో నాలుగున్నరేళ్లలో కనీసం 500 కోట్ల ప్రజాధనం లూటీ అయినట్లు ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఉద్యోగులకు జీతాలు జీతాలు, కాంట్రాక్టర్లకు జీతాలు బిల్లులు చెల్లించేందుకు నెలనెలా దిక్కులు చూస్తున్న దుస్థితిలోనూ ఈ చెల్లింపులు ఎవరి కోసం చేస్తున్నారు? దీనిపై విపక్షాల అభ్యంతరాలేమిటి? ఒక యూట్యూబ్ ఛానల్ ఓనర్‌ను తెచ్చి కార్పొరేషన్ ఛైర్మన్ చేయడం, సొంత పత్రికలో పనిచేసే వారికి ప్రభుత్వంలో పదవులిచ్చి భారీగా జీతభత్యాలు చెల్లించడం అధికార దుర్వనియోగం కాదా? ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడానికి, బిల్లులు చెల్లించడానికి దిక్కులేని పరిస్థితుల్లో గూగుల్ యాడ్స్, వివిధ వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంత భారీ చెల్లింపులు ఎందుకు చేస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.