ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidhwani

ETV Bharat / videos

ఓటర్ల జాబితా విషయంలో ఏపీలోనే ఎందుకు ఇన్ని ఫిర్యాదులు ?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 9:52 PM IST

Prathidhwani:రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. వారి కన్ను పడిందంటే చాలు ఓటు మాయం కావాల్సిందే. బతికున్నవాళ్లను రికార్డుల్లో నిర్థాక్షిణ్యంగా చంపేస్తారు. ఇళ్లు, వాకిలి అంతా ఓట్లు ఓట్ల జాబితాల్లో ఊళ్ల నుంచి గెంటేస్తారు. తమకు అవసరం అనుకుంటే ఆత్మలకు సైతం ఓట్లు కల్పిస్తారు. పద్ధతులు పట్టించుకోరు. అడ్డొచ్చిన వారిని ఏం చేయడానికైనా వెనకాడరు. అట్టే మా‌ట్లాడితే ఉల్టా కేసులు పెట్టించి జైళ్లో వేయించగల సమర్థులు కూడా. కొన్ని నెలలుగా విపక్షాలు, వారి సానుభూతిపరుల ఓట్లపై వేటే లక్ష్యంగా సాగుతోన్న బ్లూ గ్యాంగ్‌ దందా ఇది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కూడా దాటి పోయిన ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. కానీ ఇకనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశించవచ్చా? దేశంలో ఎక్కడా లేనిది ఒక్క ఏపీలోనే ఓటర్ల జాబితా విషయంలో ఎందుకిన్ని కంప్లయింట్లు వస్తున్నాయి? అనే ప్రశ్న కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల అధికారులను అడిగింది. ఇప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details