ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గంజాయి పై ప్రతిధ్వని కార్యక్రమం

By

Published : Mar 3, 2023, 11:02 PM IST

Updated : Mar 4, 2023, 6:48 AM IST

ETV Bharat / videos

Prathidhwani గంజాయికి ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రెస్‌గా ఎందుకు మారింది?

గత కొంత కాలంగా.. గంజాయి ప్రభావం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. దీని ప్రభావం యువత, విద్యార్థులపైనా తీవ్రంగా పడుతుంది. ఈ గంజాయి పంజా పాఠశాలల్లో సైతం విసురుతుంది. ఇప్పటికే  విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమహేంద్రవరం,  తిరుపతి... ఇలా అనేక నగరాల్లో ఇలాంటి   బ్యాచ్లు పెరుగుతున్నాయి. గంజాయి ముఠాలు తొలుత విద్యార్థిని మత్తుకు అలవాటు చేస్తున్నారు. తర్వాత ఈ విష వల యంలో చిక్కుకునేలా చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అలా వ వారిని అడ్డం పెట్టు కుని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కాలేజిల్లో సరఫరా  చేస్తున్నారు.  కొన్నాళ్లుగా గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్న వారూ..  వినియోగిస్తూ పట్టుబడిన వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారు. మరి కొన్ని  చోట్ల రౌడీషీటర్లే వీళ్లను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారితో నేరాలు చేయించడం కాకుండా, అమాయకులైన విద్యార్థులను గంజాయి సరఫరాదారులుగానూ మార్చేస్తున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. అలాంటి వారిని గురించి  పోలీసులకు తెలిసినా చర్య లేవన్న విమర్శలున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, ప్రభుత్వానికి  వ్యతిరేకంగా మాట్లాడేవారిని అక్రమంగా గంజాయి కేసులో ఇరికిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

 గంజాయి వాడకం ప్రభావం ఏపీలో యువత పైన ఎలా ఉంటోంది... పాఠశాలల్లోనూ గంజాయి దొరకటం దేనికి సంకేతాలు ఇస్తున్నాయి. గంజాయి సాగు, గంజాయి రవాణా, గంజాయి వాడకం ఈ మూడింటికీ ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రెస్‌గా ఎందుకు మారుతుంది. బాధితులుగా మారుతున్న వారిలోనే కాదు.. గంజాయి అక్రమ రవాణాల్లో యువత, విద్యార్థుల పాత్ర తరచు తెరపైకి వస్తుంది. గంజాయి స్మగ్లర్లకు భయం ఎందుకు లేకుండా పోతుంది. అసలు వారికి అండగా నిలుస్తున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు. ఈ గంజాయి మత్తులో ఒళ్లు పై తెలియకుండా నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో ఈ పరిణామాల్ని ఎలా చూడాలి ఉంటుంది. గంజాయి అక్రమ రవాణ వార్తలు ప్రతి జిల్లా నుంచి తరచు వస్తూంటాయి. పోలీసుల వాటిని తగలబెడుతున్న దృశ్యాలూ చూస్తున్నాము. కానీ వెలుగులోకి రాని గంజాయి పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించారా... కేవలం గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వం గంజాయిని ఉక్కుపాదం మోపుతున్నాం అని చెబుతునే ఉంది . గంజాయి మత్తు విస్తృతి పెరుగుతునే ఉంది. గంజాయి సాగు చేస్తుంటే కనిపెట్టడానికి, సాగు దశలోనే అరికట్టడానికి ప్రభుత్వానికి యంత్రాంగం లేదా.. స్థానికంగా ఉన్న అధికారులు, వారిని పర్యవేక్షించే పెద్దలు ఏం చేస్తున్నట్లు. ఈ పరిస్థితుల్లో యువతరాన్ని కాపాడుకోవడమెలా...  అనే అంశాలపై నేటీ ప్రతిధ్వని కార్యక్రమం.

Last Updated : Mar 4, 2023, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details