ఆంధ్రప్రదేశ్

andhra pradesh

paddy_piles_drowned_in_flood

ETV Bharat / videos

నీటమునిగిన ఆరునెలల కష్టం - ఆందోళనలో అన్నదాత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 4:04 PM IST

Paddy Piles Drowned in Flood: మిగ్​జాం తుపాను అన్నదాతలకు కన్నీటినే మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి, వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు వర్షాల కారణంగా నీటిపాలయ్యాయి. చేతికి వచ్చిన పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కృష్ణా జిల్లాలోని కంకిపాడు వద్ద పంట పొలాల్లోకి భారీగా నీరు చేరడంతో వరికుప్పలు నీటమునిగాయి. తుపాను వస్తుందనే సమాచారంతో పంటను కాపాడుకోవడానికి వ్యయ ప్రయాసాలకు ఓర్చి చేసిందంతా వృథాగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేల రూపాయలు ఖర్చు చేసి వరికుప్పలు వేసినా వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షపు నీరు దాదాపు మూడు కట్టల వరస ఎత్తు వరకు వచ్చిందని రైతులు తెలిపారు. అంతేకాకుండా వర్షానికి తడవకుండా ఉండేందుకు వరి కుప్పలపై ఏర్పాటు చేసిన పైకప్పులు కూడా, ఈదురుగాలులకు ఎగిరిపోయాయని రైతులు అన్నారు. ఫలితంగా వర్షానికి తడిచిపోయాయని చెబుతున్నారు. రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details