ఆంధ్రప్రదేశ్

andhra pradesh

form7_votes_bapatla

ETV Bharat / videos

'ఫాం 7 దరఖాస్తుల పరిశీలన' 80శాతం బోగస్! - విచారణకు మొహం చాటేస్తున్న వైసీపీ సానుభూతిపరులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 2:33 PM IST

Officials are Examining Form 7 votes : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో మలి విడతలోనూ ఓట్ల తొలగింపు కోరుతూ 8 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఫాం 7 దరఖాస్తులు చేసిన వారిలో అత్యధికులు వైసీపీ వర్గానికి చెందినవారు ఉన్నారు. వారిలో చాలామంది అధికారుల విచారణకు మొహం చాటేస్తున్నారు. అదే సమయంలో బాధితులు మాత్రం అధికారులకు వివరాలన్నీ చెప్పి, తామూ స్థానిక ఓటర్లేనని నిరూపించుకోవాల్సి వస్తోంది. దరఖాస్తులు చేసినవారు విచారణకు రానప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అధికారుల్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

Officers Surveying the Votes : పర్చూరు నియోజకవర్గం యద్ధనపూడి, గన్నవరం గ్రామాల్లో ఇంటింటికి అధికారులు తిరుగుతూ ఓట్లు వివరాలు సేకరిస్తున్నారు. ఫాం 7 ద్వారా డిసెంబరు 9 నాటికి మొత్తం 200 మందికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 80 శాతం మంది విచారణకు రావడం లేదని పేర్కొన్నారు. అక్టోబరు 27కు ముందు 14 వేలకు పైగా ఫాం 7లు రాగా, ఆ తర్వాత 8 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. 17 వేల దరఖాస్తులను విచారించి, వాటిలో 4,200 మంది మృతుల ఓట్లు ఉన్నాయని ఎన్నికల అధికారులు తేల్చారు. మిగిలిన దరఖాస్తులను త్వరలోనే పరిశీలిస్తామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details