NIA Raids in PFI Leaders Houses in Kurnool: కర్నూలులో పీఎఫ్‌ఐ నాయకుల ఇళ్లల్లో ఎన్‌ఐఏ సోదాలు - పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
NIA Raids Houses of PFI Leaders in Kurnool: తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సోదాలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధాలు ఉన్న వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఎన్‌ఐఏ అధికారులు తెల్లవారుజామున నుంచి సోదాలు చేశారు. పీఎఫ్ఐకి చెందిన ఇద్దరు నాయకుల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. పాత నగరానికి చెందిన అబ్దుల్, ఆటో నగర్‌కు చెందిన అమీర్ ఇంట్లో అధికారులు సోదాలు చేసి అనంతరం వారిని కర్నూలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పోలీస్ రెస్ట్ హౌస్‌కు తరలించి విచారిస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో కరీంనగర్‌కు చెందిన తబరాజ్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసి.. వారి కుటుంబ సభ్యులను విచారించారు. కాగా తబరాజ్ కొద్ది నెలల క్రితం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. గతంలో కూడా ఎన్‌ఐఏ అధికారులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుల ఇళ్లలో సోదాలు చేశారు.