Nara Lokesh Record in Yuvagalam Padayatra: నారా లోకేశ్ మరో ఘనత.. చంద్రబాబు 'వస్తున్నా మీకోసం పాదయాత్ర' రికార్డ్ బ్రేక్ - పాదయాత్ర వివరాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2023, 10:16 PM IST
Nara Lokesh Broke Chandrababu Padayatra Record: యువగళం పాదయాత్ర ద్వారా... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో అరుదైన ఘనత సాధించారు. లోకేశ్ తన తండ్రి చంద్రబాబు 'వస్తున్నా మీకోసం పాదయాత్ర' రికార్డ్‌ని అధిగమించారు. 2012లో వస్తున్నా మీకోసం పేరిట నారా చంద్రబాబు 208 రోజుల్లో 2వేల 817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. యువగళం ద్వారా 206 రోజుల్లోనే 2వేల 817 కిలోమీటర్ల మైలురాయిని యువనేత అధిగమించారు. పాలనలోనూ, పారదర్శకతలోనూ, నాయకత్వ పటిమలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న నారా లోకేశ్(Nara Lokesh) అంటూ నేతలు ప్రశంసించారు.
Lokesh 2800 Kilometers Padayatra Completed: ఈ ఏడాది జనవరిలో లోకేశ్ కుప్పంలో యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) ప్రారంభించారు. 400 రోజులలో 4000 కిలోమీటర్ల లక్ష్యంతో యువగళం పాదయాత్ర కుప్పంలో ఆరంభమైంది. వైకాపా సర్కార్ కల్పిస్తున్న అడ్డంకులను అధిగమిస్తూ.. ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ జనమే దళమై.. బలమై యువగళం పాదయాత్ర దూసుకుపోతోంది. ఇప్పటివరకు లోకేశ్ మొత్తం 2818.4 కి.మీ దూరం నడిచారు. ఈరోజు 17.7 కి.మీ మేర పాదయాత్ర సాగింది.